*మిర్చి అమ్మేందుకు వెళ్లిన రైతులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.* బళ్లారి (26) అనంతపురం జిల్లా రామదుర్గ తాలూకా సరిహద్దులోని బొమ్మనహాలు మండలం గోవిందవాడ గ్రామానికి చెందిన రైతులు అశోక్ లాయ్ ల్యాండ్ దోస్త్ వాహనం KA.,34.సి.5693. మిర్చి అమ్మేందుకు వాహనంలో ఆదివారం హవేరి బ్యాడిగి మార్కెట్‌కు వెళుతుండగా, దోస్త్ వాహనంలో కూర్చొని ఉండగా, తెల్లవారుజామున.4 గంటల సమయంలో తమ్మేనహళ్లి రాజపుర సమీపంలో రాంపూర్ సమీపంలో ముందు వేళ్ళుతున్న మరో వాహనం ను ఢీ కొట్టింది.
ఆదివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో దాసరి కేశప్ప (34), బోయ వాండ్రప్ప (64) అక్కడికక్కడే మృతి చెందారు.
మరొకరకు, డ్రైవర్‌కు గాయాలు కాగా, బళ్లారిలోని విమ్స్ ఆసుపత్రిలో చేరారు.
రాంపుర పోలీస్ స్టేషన్‌లో కేసు ఫైల్ జరిగింది. సరిహద్దు ప్రాంతలలో కర్ణాటక కర్నూలు ,అనంతపురం లలో సరైన మిర్చి మార్కెట్ లేకపోవడంతో పైనున్న కర్ణాటక బ్యాడిగి మార్కెట్ పైన రైతులు ఆధారపడుతున్నారు. ఈ రోడ్డు ప్రమాదాల్లో లెక్కలేనంత మంది రైతులు చనిపోయారు. ఇందుకు ప్రభుత్వాలు, రాజకీయ నాయకులే కారణమని.. అప్పులు చేసి బజారుకు అమ్మిన డబ్బుతో అప్పులు కట్టుకొని జీవితం గడపలాని కనసు కట్టుకోన్న రైతుల కల చీకటి గా మారింది. (కె. బజారప్ప రిపోర్టర్. బళ్లారి.)